పిల్లలతో క్వాలిటీ సమయం ఎలా గడపాలి?

03 December 2023

మీ పిల్లల మనసును తెలుసుకుంటూ.. వారిపై ప్రేమను పంచే దంపతుల పెంపకంలో పిల్లల మానసికారోగ్యం పెరుగుతుంది.  చిన్నారుల ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

ఉద్యోగ ఒత్తిళ్లు, పెరుగుతున్న గ్యాడ్జెట్ల వినియోగం, భార్యాభర్తలిద్దరికీ కనీసం మాట్లాడుకునే సమయం లభించకపోవడం వంటివన్నీ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

తల్లిదండ్రులు ఏదో ఒక కారణంతో ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం, బాధ్యతలను పంచుకోవడంలో విమర్శించుకోవడం, దూషించుకోవడం వంటివన్నీ పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి

పెద్దల ప్రవర్తన అర్థంకాక, వారెందుకు కోపంగా ఉంటున్నారో అవగాహన లేక చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. తమ ఆలోచనలను పంచుకోవడానికి భయపడుతుంటారు.

పిల్లలెదుట తల్లిదండ్రులు ఎప్పుడు సమస్యలను చర్చించుకోకూడదు. వారితో సమయం ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

అలాగే తల్లితండ్రుల సంభాషణ అన్యోన్యంగా, ప్రేమపూర్వకంగా, పరస్పర గౌరవంతో ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

చిన్నారులకు కేటాయించే సమయంలో 80 శాతాన్ని వారి భావోద్వేగాలను గుర్తించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, మిగతా 20 శాతం వారితో ప్రేమగా, అనునయంగా మాట్లాడటం చేయాలి

కలిసి భోజనం చేయడం, కథలు వినిపించడం, రోజూ వారికెదురైన అనుభవాలను తెలుసుకోవడం, ఆలోచనలను పంచుకోవడం వంటివన్నీ వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తాయి.