సీజన్లతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చౌకగా దొరికేది ఒక్క అరటి పండు మాత్రమే. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు
TV9 Telugu
తక్షణ శక్తికి, తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడంలోనూ మెరుగ్గా పని చేస్తుందీ పండు. అయితే మార్కెట్లో అరటి పండు మగ్గడానికి వ్యాపారులు వివిధ ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుంటారు
TV9 Telugu
పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇలా కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్, ఇథలిన్ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టేన్నారు
TV9 Telugu
ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నా.. లాభాల కోసం కొందరు రైతులు, విక్రయదారులు ఇలాంటి రసాయనాలు వినియోగిస్తున్నారు
TV9 Telugu
ఇప్పుడైతే రసాయనాలు ఉన్నాయి కానీ పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఓ టెక్నిక్ ఉపయోగించేవారట. దీంతో అరటి పండ్లు సహసిద్ధమైన రీతిలో మగ్గేవట
TV9 Telugu
తాజాగా ఓ బామ్మ పూర్వకాలంలో అరటి పండ్లను ఎలా ముగ్గబెట్టేవారో ఆ టెక్నిక్‌ను వీడియో చేసి మరీ చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి అందులో ఈ అరటి గెలను ఉంచింది
TV9 Telugu
తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి పొగలు కక్కుతున్న దాన్ని కూడా అరటిపండ్ల గెల పక్కన గోతిలో పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి, పైన మరిన్ని ఎండిన కొబ్బరి మట్టలు, మట్టిని కూడా వేసి రెండు రోజులు వదిలేసింది
TV9 Telugu
2 రోజుత తర్వాత గోతిని తవ్వి చూస్తే చక్కగా మంచి సువాసనతో అరటి పడ్లన్నీ చక్కగా ముగ్గిపోయి కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇకపై మనం కూడా ఈ టెక్నిక్ ఫాలో అవుదాం