కూరగాయలపై రసాయనాలు వదిలించాలంటే..

January 01, 2024

TV9 Telugu

నేటి కాలంలో సాగుకు పురుగుమందులు యదేచ్ఛగా ఎడాపెడా వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే అవి నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి

ముఖ్యంగా కూరగాయలు తాజాగా ఉండేందుకు వాటిపై శక్తివంతమైన క్రిమిసంహారక మందులు చల్లుతుంటారు

ఇలా కూరగాయలు, పండ్లకు అంటిన పురుగు మందులను వదిలించేందుకు అనేక మంది గృహిణులు రకరకాల రకరకాల పద్ధతులు వినియోగిస్తుంటారు

నిజానికి నీటితోనే 90 శాతం వీటిని శుభ్రం చేసుకోవచ్చు. కూరగాయలకు అంటిన రసాయనాలను శుభ్రం చేయడానికి ఏం చేయాలంటే..

ఒక గిన్నె నీటిలో నిమ్మరసం, సోడా ఉప్పు, ఆపిల్‌ సిడార్‌ వెనెగర్‌ కలుపుకోవాలి. ఆ ద్రవాన్ని కూరగాయల మీద చల్లి ఐదారు నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే సరి

కూరగాయల పైన తొక్క తీసేయాలి అనుకున్నప్పుడు వాటిని కడగాల్సిన అవపకం లేదరి చాలా మంది అనుకుంటారు. నిజానికి తొక్క తీసేటప్పుడు వాటికి ఉన్న రసాయనాలు అంతటా పరుచుకునే  ప్రమాదం ఉంది

కాబట్టి తొక్క తీసేముందు కూడా కూరగాయలు కడగాల్సిందే. ఇంట్లో పండించిన సేంద్రియ కూరగాయలపై పురుగుమందులు లేకపోవచ్చు

కానీ బ్యాక్టీరియా తిష్ఠవేసే ప్రమాదం లేకపోలేదు. వాటినీ శుభ్రం చేయాల్సిందే. కాబట్టి ప్రతీ కూరగాయనూ వాడేముందు మళ్లీ నీళ్లతో తప్పనిసరిగా కడగాలి