వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా తగ్గించుకోండి

03 September 2024

TV9 Telugu

TV9 Telugu

చాలా మంది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి చియా సీడ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ చియా విత్తనాలను తినడానికి సరైన మార్గం చాలా మందికి తెలియదు

TV9 Telugu

చికెన్‌, మటన్ లేదా శాఖాహారం.. ఏదైనా కావచ్చు.. ఒక్కోసారి అనుకోకుండా వంటలో ఉప్పు ఎక్కువవుతుంది. దీంతో అయిష్టంగా తినలేక.. వండినదంతా పడేయలేక ఇబ్బందిపడిపోతుంటాం

TV9 Telugu

వంట్లో ఉప్పు తక్కువైనా కష్టం, ఎక్కువైనా కష్టమే. రుచికి సరిపడా తీసుకుంటే ఆరోగ్యంతోపాటు ఆనందం మీసొంతం అవుతుంది. అయితే పొరపాటున వంటలో ఉప్పు ఎక్కువ పడితే వంట మొత్తం పారేయాల్సిందేనా? అని చింతించకండి

TV9 Telugu

వెంటనే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి. ఈ చిట్కాలు చిటికెలో వంటలో ఉప్పును తొలగించేస్తాయి. ఈ హోమ్ ట్రిక్స్ అన్నీ వంటల్లో ఉప్పు సమస్యను పరిష్కరిస్తాయి

TV9 Telugu

ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి రెండు ముక్కలుగా కోసి.. వండిన కూరలో వేసి మరికాసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు అదనపు ఉప్పును గ్రహిస్తాయి. లేదంటే వేయించిన ఉల్లిపాయలను కూడా ఉపయోగించవచ్చు

TV9 Telugu

ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకుని బాగా చిలక్కొట్టాలి. ఇప్పుడు ఉప్పు ఎక్కువైన వంటలో పెరుగు కలపాలి. పెరుగులోని పులుపు కూరలోని అదనపు లవణం తగ్గిస్తుంది

TV9 Telugu

ఉప్పు ఎక్కువగా ఉంటే ఆ వంటలో కొంచెం చక్కెర, వెనిగర్ జోడించాలి. కావాలంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే కూరలోని ఉప్పు కాఠిన్యం తొలగి పోతుంది

TV9 Telugu

బంగాళదుంప తొక్కలు కూరల్లో ఎక్కువైన ఉప్పును తొలగించడానికి ఉపయోగపడుతుంది. వంట సమయంలో బంగాళాదుంపల తొక్కలను కూరలో వేసి, కాసేపటి తర్వాత వాటిని తీసేయాలి. ఇలా చేస్తే కూరలోని ఉప్పదనం అంతా తొలగి పోతుంది