కుక్కర్‌ నుంచి వాటర్‌ లీక్‌ అవుతోందా? 

17 November 2023

ప్రతి ఉదయం దాదాపుగా ప్రతీ ఇంట్లో కుక్కర్ విజిల్ వినిపిస్తూనే ఉంటుంది. ఆహారాపదార్ధాలు తొందరగా ఉడుకుతుంది కాబట్టి అందరూ వంటలకు కుక్కర్‌నే యూజ్ చేస్తుంటారు

అయితే ఒక్కోసారి కుక్కర్ మూత నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది. దీంతో కుక్కర్ పైభాగంతోపాటు గ్యాస్ స్టౌ మొత్తం మరకలు పడతాయి

వీటిని క్లీన్‌ చేయడానికి మళ్లీ బోలెడంత సమయం పడుతుంది. చూడ్డానికి చిన్న సమస్యలా కనిపించినప్పటికీ వంట చేసే వారికి ఇది ముమ్మాటికీ ఇబ్బందే

కొన్ని టిప్స్ పాటిస్తే కుక్కర్ లీకేజీ సమస్యను అరికట్టవచ్చంటున్నారు నిపుణులు. కుక్కర్‌లో ఆహారాన్ని వండుతున్నప్పుడు మూత నుంచి నీరు లీక్‌ కాకుండా ఉండటానికి కుక్కర్‌లో ఒక చుక్క నూనె వేయాలి

ఇలా చేయడం వల్ల కుక్కర్‌ వాటర్ లీకేజీని అడ్డుకోవచ్చు.నూనె వేస్తే కుక్కర్‌లోని ఆహార పదార్థాలు పాత్రకు అంటుకోకుండా, విడివిడిగా మృదువుగా ఉంటాయి

కుక్కర్ లోపల ఉండే రబ్బర్‌ సరిగ్గా సెట్ చేయకపోవడం వల్ల కూడా ఆవిరి లీక్‌ కావడానికి అవకాశం ఉంటుంది. రబ్బరు సరిగ్గా ఫిట్‌ అవ్వకపోతే వాటర్‌ లీక్‌ అవుతుంది

మీరూ కుక్కర్‌ను వాడుతున్నట్లయితే రబ్బరు ఎక్కువ కాలం రావాలంటే.. వంట చేసిన తరవాత ఆ రబ్బరును శుభ్రం చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి

కుక్కర్‌ మూతకు ఉన్న సేఫ్టీ ప్లగ్‌, వాచర్‌లు తేలికగా ఉన్నా వాటర్ లీక్ అవుతుంది. కుక్కర్‌లో ఉడికించేటప్పుడు ఒకేసారి మూతను బిగించకుండా, ఒక పొంగు వచ్చిన తరవాత మూతను బిగిస్తే వాటర్‌ లీక్‌ కాకుండా ఉంటుంది