కొంత మంది పిల్లలు చిన్న వయసు నుంచే అధికంగా బరువు పెరుగుతుంటారు. టీనేజ్‌కి వచ్చేసరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉంటుంది
శరీరంలో క్యాలరీలు కరగడం తగ్గడం, సరైన వ్యాయామం లేకపోవడం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటి కారణాల వల్ల ఇలా చిన్నతనంలోనే స్థూలకాయం వస్తుంది
బరువు విషయంలో చిన్నతనం నుంచే జాగ్రత్తగా తీసకుంటే ఇతర అనారోగ్యాల బారి నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. టీనేజ్‌లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే తల్లులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
చాలామంది పిల్లలు ఏది చేయొద్దంటామో.. అదే చేస్తుంటారు. ఆరోగ్యానికి మంచిది కాద ని చెప్పినా సరే.. అవే తింటామని మొండికేస్తుంటారు
వారిని అలాగే వదిలేస్తే చిన్నతనం నుంచే జంక్‌ఫుడ్, నూనె సంబంధిత పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్.. వంటి కొవ్వులు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు అపరిమితంగా తినేస్తుంటారు
అలాగని వాటిని పూర్తిగా తీసుకోవడం మానేయకుండా నెలకో, పదిహేను రోజులకో ఏదో ఒక పదార్థం తక్కువ మొత్తంలో తినేలా వారిపై ఓ కన్నేసి ఉంచాలి
టీనేజీలో స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు పిల్లలకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. నడక, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, మెట్లెక్కడం, యోగా, ఈత, డ్యాన్స్, ఆటలు.. వంటివి వారితో చేయించాలి
పిల్లలు చిన్నతనం నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అలవాటు పడడం వల్ల కూడా వారు టీనేజీకి వచ్చేసరికి స్థూలకాయం బారిన పడుతుంటారు. కాబట్టి పిల్లల్ని వీటికి దూరంగా ఉంచాలి