డిప్రెషనా..! భయపడొద్దు ఇలా బయటపడండి..

March 01, 2024

TV9 Telugu

డిప్రెషన్.. నేటి కాలంలో అత్యంత ప్రమాదకర సైలెంట్‌ కిల్లర్‌ ఈ వ్యాధి. దీని బారిన పడిన వారు దాన్నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఆత్మహత్యకు దారి తీసే కారణాల్లో డిప్రెషన్ అతిముఖ్యమైనది

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఈ మానసిక వైకల్యం కుంగతీస్తోంది. భావోద్వేగాల్ని మనసులోనే దాచుకుంటూ కుమిలిపోతే చివరికి మానసిక ప్రశాంతత కరువై డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు

భయపెట్టే సంఘటనైనా.. ఇబ్బందులకు గురి చేసే పరిణామాలైన.. సమస్యలేవైనా సరే ఎప్పటికప్పుడు వాటిని డైరీలో రాసుకోవడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత లభిస్తుందట

లేదంటే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ సమస్యల గురించి మనసు విప్పి మాట్లాడండి. దీనివల్ల మనసు తేలికపడి.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి వీలుంటుంది

అలాగే ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేషన్ చేయాలి. మనసుకు మరింత బాధ కలిగినప్పుడు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను నెమరువేసుకుంటే బాధ మాయం అవుతుంది

మంచి మ్యూజిక్ వినడం.. నచ్చిన పుస్తకం చదవడం వంటి పనుల్లో నిమగ్నమైపోయి బాధ నుంచి విముక్తి పొందొచ్చు. అప్పటికీ ఫలితం లేకపోతే ఓ వారం పాటు నచ్చిన ప్రదేశాలకు వెళ్లి రండి

మీరు అమితంగా ఆరాధించే, ఇష్టపడే వ్యక్తులను వీలైనప్పుడల్లా కలవడం, మాట్లాడటం చేస్తూ ఉండాలి. కుదిరితే ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, ఏరోబిక్స్, టెన్నిస్ ఇలా ఏదోఒకటి అలవాటు చేసుకోండి

మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజూ కనీసం ఏడెనిమిది గంటలైనా నిద్రపోవాలి. అలాగే నీరు అధికంగా తాగాలి. అలాగని శీతల పానీయాల జోలికి పోకూడదు. కాఫీ, టీ సాధ్యమైనంత మితంగా తాగాలి