ఈ సింపుల్ ట్రిక్‌తో.. కొన్ని నిమిషాల్లోనే మీ ఫోన్ ఫుల్ ఛార్జ్!
24 October 2024
TV9 Telugu
TV9 Telugu
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. బహుళ ప్రయోజనాల కోసం వీటిని వాడుతున్నారు. కేవలం ఫోన్ మాట్లాడటం మాత్రమే కాకుండా ఆఫీస్ వర్క్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు అన్నింటికీ మొబైల్ వాడేస్తున్నారు
TV9 Telugu
అయితే ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఒక్కోసారి ఇబ్బంది పడుతుంటాం. తుఫానులు, వర్షాల కారణంగా విద్యుతు అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ఫోన్ ఛార్జింగ్ కష్టమవుతుంది
TV9 Telugu
ఫోన్ ఛార్జింగ్ అయిపోతే.. అత్యవసర పరిస్థితుల్లో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయడం చాలా ముఖ్యం. ఒక్క క్షణంలో ఫోన్ 100 శాతం ఛార్జ్ అయితే బావుండు అని ఈ సందర్భంలో అనిపిస్తుంది
TV9 Telugu
అయితే మీరు నిజంగానే కేవలం కొద్ది నిమిషాల్లోనే మీ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. మొబైల్ ఛార్జర్‌లో ఉన్నప్పుడు దానిని షేక్ చేయకూడదు. ఇలా చేస్తే ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది
TV9 Telugu
బదులుగా మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్‌లో ఉంచితే త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. లేదంటే మొబైల్‌లో యాప్స్ రన్ అవడం వల్ల ఛార్జింగ్ స్లో అవుతుంది. కాబట్టి ఛార్జింగ్ చేసే ముందు మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకుని, వాటిని ఆఫ్ చేసుకోవాలి
TV9 Telugu
మొబైల్ ఛార్జ్ అయిపోతుంటే, ముందుగా బ్రైట్‌నెస్ తగ్గించాలి. బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే ఛార్జ్ త్వరగా ముగుస్తుంది. అందుకే ముందు ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించుకుంటే మంచిది
TV9 Telugu
ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే, మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఛార్జింగ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి
TV9 Telugu
విపత్తు సమయంలో అకస్మాత్తుగా ఎప్పుడు కరెంటు పోతుందో చెప్పలేం. కాబట్టి పూర్తిగా ఛార్జ్ అయిపోయేంత వరకు వేచి ఉండకుండా.. 40 శాతం కంటే తక్కువగా ఉంటే, దాన్ని వెంటనే ఛార్జ్ చేసుకోవాలి