న్యాచురల్‌ వ్యాక్స్‌ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

05 December 2023

చేతులు, కాళ్లు.. వంటి సున్నితమైన భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

ఇంట్లోనే సులువుగా సహజంగా న్యాచురల్‌ వ్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం-టేబుల్‌స్పూన్, చక్కెర లేదా బ్రౌన్‌ షుగర్‌-టేబుల్‌స్పూన్, తేనె-టేబుల్‌స్పూన్.. వీటన్నింటినీ ఓ గిన్నెలో తీసుకోవాలి

వీటన్నింటినీ బాగా కలుపుకుని స్టౌ మీద పెట్టి పదార్థాలన్నీ బాగా కరిగి, కలిసిపోయేంత వరకూ మరగించాలి. ఆ తర్వాత వ్యాక్స్‌లా చిక్కగా మారాక సౌ ఆఫ్‌ చేయాలి

ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి.. అవాంచిత రోమాలు పెరిగే దిశలో దీన్ని అప్లై చేసి.. దానిపై వ్యాక్సింగ్‌ స్ట్రిప్‌ పెట్టి కాస్త ఒత్తాలి. ఇప్పుడు ఆ స్ట్రిప్‌ని వ్యతిరేక దిశలో లాగేస్తే సరి

ఈ న్యాచురల్‌ వ్యాక్స్‌ హెయిర్‌ని తొలగిస్తుంది. ఇందులో మనం ఉపయోగించిన తేనె చర్మానికి తేమనందించడంలో సహకరిస్తుంది. అలాగే నిమ్మరసంలోని బ్లీచింగ్‌ గుణాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి

అలాగే పసుపు కూడా అవాంఛిత రోమాల్ని తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకుని అందులో టేబుల్‌స్పూన్‌ పసుపు, టేబుల్‌స్పూన్‌ శెనగపిండి తీసుకోవాలి

తర్వాత అందులో కొద్దికొద్దిగా నువ్వుల నూనె జతచేస్తూ చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి.. కొన్ని నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్‌ చేయాలి

ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు పాటిస్తే కొన్ని వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు