మగువల అందంలో కేశ సంపద కీలకపాత్రపోషిస్తుంది. కానీ నేటి జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోవడం, రాలిపోవడం, పలచబడటం, చివర్లు చివర్లు చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు
ఊడిన జుట్టు స్థానంలో ఒత్త్తెన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి.. కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని బాగా గిలక్కొట్టి కుదుళ్లకు చేరేలా పట్టించాలి
తర్వాత 20 నుంచి 30 నిమిషాలపాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో, తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా చేస్తే ఒత్త్తెన జుట్టు మీ సొంతం అవుతుంది
తెల్లసొన గిలక్కొట్టిన తర్వాత అందులో జుట్టుకు రాసుకునే నూనె, కొద్దిగా నీళ్లు జోడించవచ్చు. ఈ మిశ్రమం కుదుళ్లకు చేరేలా మృదువుగాచేతి వేళ్లతో మర్దన చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది
అలాగే.. సరిపడినన్ని మెంతులు తీసుకొని నీటిలో 10 గంటల పాటు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్త్లె చేసుకొని 30 నుంచి 40 నిమిషాలు ఆరనివ్వాలి
తర్వాత గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయాలి. అవసరం అయితే మెంతుల మిశ్రమంలో కాస్త కొబ్బరిపాలు కూడా మిక్స్ చేసి కేశాలకు పెట్టించవచ్చు. ఇలా చేస్తే జుట్టు సమస్యలు దరి చేరవు
తలస్నానానికి షాంపూలకు బదులుగా సహజసిద్ధంగా తయారుచేసిన ఉసిరి, శీకాకాయ పొడులను ఉపయోగించినా పలచబడిన కేశాలను తిరిగి ఒత్తుగా మార్చుకోవచ్చు
ఇవి కురుల ఎదుగుదలకు అవసరమైన పోషణ అందించి, కుదుళ్లను దృఢంగా మార్చుతాయి. ఫలితంగా ఆరోగ్యవంతమైన కేశాలను తిరిగి పొందవచ్చు. వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది