ఇంట్లోనే డ్రైఫ్రూట్స్‌ తయారు చేసేద్దాం..!

March 26, 2024

TV9 Telugu

బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ వంటి డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే నీరసం, నిస్సత్తువ దరికి చేరవని మనందరికీ తెలుసు

 డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లలో ప్యాంక్రియాటిక్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్లను నిరోధించే గుణాలున్నాయి. ఇన్ని రకాలుగా మేలు చేసే డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యకరం అయినా... కొనాలంటేనే ఖరీదెక్కువ 

అలా డబ్బు పెట్టి కొనే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి రుచి భలే ఉంటాయి.. అంతేకాకుండా తయారీ విధానం కూడా చాలా సులువు. పైగా బయట దొరికేవి ఎలా ఉంటాయో అనే భయం ఉండదు

డ్రైఫ్రూట్స్‌ని తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన పండ్లను ఎంపిక చేసుకుని, శుభ్రంగా నీళ్లలో వేసి కడుగుకోవాలి. వీలైనంత  వరకు సిట్రస్‌ ఫ్రూట్స్‌నే ఎంపిక చేసుకోవాలి

ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మరసం కలిపిన నీటిలో కాసేపు నానబెట్టాలి. నిమ్మలో ఉండే ఆమ్లాలు పండ్ల సహజ రంగుని కోల్పోకుండా కాపాడతాయి

వీటికి కాస్త తీపిని జోడించాలనుకుంటే ఎంచుకున్న పండ్లను షుగర్‌ సిరప్‌లో కాసేపు ఉంచి బయటికి తీస్తే సరి. ఇప్పుడు పండ్లన్నీ ఓ పళ్లెంలో పలుచగా పరిచి దుమ్మూధూళి పడకుండా పలుచని క్లాత్‌ కప్పాలి

తర్వాత వీటిని ఎండలో ఆరనివ్వాలి. అంతే డ్రై ఫ్రూట్స్‌ తయారై పోతాయి. లేదంటే మైక్రో ఓవెన్‌లో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వీటిని వేడి చేయాలి. మధ్య మధ్యలో బయటికి తీస్తూ పూర్తిగా డ్రై అయ్యేవరకూ ఉంచాలి

ఇలా తయారు చేసుకున్న పండ్లను పూర్తిగా చల్లారనిచ్చి తేమలేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇవి ఏడాదంతా తాజాగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్‌ మధుమేహం, మూత్రపిండాల సమస్యలతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి