రెస్టారెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే.. ఇలా చేస్తే రుచి మారదు
22 August 2024
TV9 Telugu
TV9 Telugu
ఫ్రెంచ్‌ఫ్రైస్ అంటే నచ్చని వారు ఉంటారా? బంగాళదుంపలతో తయారు చేసే ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని లొట్టలేసుకుని మరీ తింటారు. ఉప్పు, కారం, కాస్త మసాలా దట్టించి తింటే.. అబ్బబ్బా! ఆ రుచే వేరు
TV9 Telugu
అందుకే వాటి రేటు ఎంత ఉన్నా సరే! లైట్ తీసుకొని మరీ.. ఎగబడి కొంటారు. ఇప్పుడు ఏ ఫుడ్‌స్టాల్స్‌లో చూసినా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌దే రాజ్యం. ఇంట్లో స్నాక్స్ చేయాలన్నా.. దీనిదే హవా
TV9 Telugu
అయితే ఇంట్లో తయారుచేసిన పొటాటో ఫ్రైస్‌కి, రెస్టారెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి చాలా తేడా ఉంది. ఆ రుచి రాదు.. ఆ క్రిస్పీనెస్ కూడా రాదు. ఎంత ప్రయత్నించినా ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడం అస్సలు కుదరదు. చివరికి అది వేయించిన బంగాళదుంపలు గానే కనిపిస్తాయి తప్ప.. రెస్టారెంట్ టేస్ట్ రానేరాదు
TV9 Telugu
అలాకాదని కేఫ్‌కి వెళ్లి ఫ్రెంచ్ ఫ్రైస్ తిందాంటే ధర చుక్కలు చూపిస్తాయి. అంత ఖర్చు పెట్టలేని వాళ్లు ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలతో ఫెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
TV9 Telugu
ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని రకాల బంగాళదుంపలతో తయారు చేయలేం. కొంచెం పెద్ద సైజు బంగాళదుంపను ఎంచుకోవాలి. చక్కెర, స్టార్చ్ అధికంగా ఉండే బంగాళదుంపలను ఉపయోగించాలి
TV9 Telugu
ముందుగా.. బంగాళాదుంపలను పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని 15 నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టుకోవాలి. స్టార్చ్ బయటకు వచ్చిన తర్వాత.. వీటిని నీటిలో వేసి 2 నిమిషాలు ఉడికించాలి
TV9 Telugu
బంగాళాదుంపలను నీటిలో ఉడకబెట్టిన తర్వాత 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించడానికి రెడీ అవుతాయి. అప్పుడే మీకు కావలసిన రుచి వస్తుంది
TV9 Telugu
ముందుగా మీడియం మంట మీద వేయించాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుని, చల్లారాక మళ్లీ నూనెలో వేయించాలి. ఇలా వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్‌పై ఉప్పు-మిరియాల పొడి చల్లుకుంటే సరి