ఇంట్లోనే బాదం మిల్క్‌ తయారీ ఇలా.. ఎండా కాలం చల్లచల్లగా..!

TV9 Telugu

17 March 2024

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంటే చాలు జనం వణికిపోతున్నారు.

ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ వేడికి బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది.

బాదం, జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదే విధంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

కర్బూజా, కమలా పండ్ల జ్యూస్‌లతో పాటు చల్లచల్లటి బాదాం మిల్క్‌ కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నానబెట్టిన బాదంపప్పు రోజూ తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో కలిపిన పాలు శరీరానికి కాల్షియం అందిస్తాయి.

ఇది పిల్లలకు శక్తినిచ్చి ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది. బాదం, జీడిపప్పు, పాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బాదాంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకుని మరో గిన్నెలో వెన్న తీయని పాలను మరిగించుకోవాలి.

మరిగిన పాలను చల్లార్చి యాలకుల పొడి, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ముందే పొడిచేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు మిశ్రమాన్ని పాలల్లో కలపాలి.