మీ ఆధార్‌ దుర్వినియోగం అయిందా? తెలుసుకోవడం ఎలా..?

TV9 Telugu

27 August 2024

దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లిన సరే నిత్యం అవసరమయ్యే డాక్యుమెంట్లలో ఎక్కువగా వినిపించేది ఆధార్‌ కార్డు.

ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, కొన్ని రకాల సేవలు పొందాలన్నా ఈ 12 అంకెల గుర్తింపు పత్రం చాలా ముఖ్యమని తెలిసిందే.

ఇందులో మన వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్‌ వివరాలూ నిక్షిప్తమై ఉంటాయి. అలాంటి ముఖ్యమైన ఆధార్‌ కార్డును చాలా మంది ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటారు.

ఆధార్‌ను విరివిగా వాడటం వల్ల ఆధార్‌ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా చూసుకోవడం ముఖ్యం.

మరి మీ ఆధార్‌ ఎక్కడైనా దుర్వినియోగం అయ్యిందా? అయ్యుంటే ఫిర్యాదు చేయడం ఎలా? కాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?

ఇందులో ఎక్కడైనా మీకు తెలియకుండా ఆధార్‌ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

మీ వేలిముద్రలు వారి చేతికి చిక్కాయనడంలో ఎలాంటి సందేహం లేదు. help@uidai.gov.in కి లేదా ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో నేరుగా కంప్లెయింట్‌ చేయొచ్చు.

ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్‌ కార్డ్‌ను బయోమెట్రిక్‌ లాక్‌ చేయడం ఉత్తమం. దాన్ని కూడా సులువుగా ఆన్‌లైన్‌లో చేయొచ్చు.