మెదడుకు పదును పెట్టే అలవాట్లు.. విజేతల రహస్యం ఇదే!

11 August 2024

TV9 Telugu

TV9 Telugu

ప్రకృతి నియమాల ప్రకారం మన శరీర పనితీరు వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. దానితో పాటు జ్ఞాపక శక్తి కూడా సన్నగిల్లుతుంది

TV9 Telugu

కానీ కొన్ని రోజువారీ అలవాట్లు ప్రకృతి నియమాలను మార్చగలవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి మెదడుకు మరింత పదునుపెట్టి ఆరోగ్యంగా ఉంచుతాయి

TV9 Telugu

అలాంటి వాటిల్లో కొత్త భాష నేర్చుకోవడం లేదా ఏదైనా మ్యూజిక్‌ వాయిద్యం వాయించడం నేర్చుకోవడం వంటివి చేయాలి. అంటే కొత్తగా నేర్చుకునే ఆనందం మనసును ఆహ్లాదకరం చేస్తుంది

TV9 Telugu

ఫలితంగా మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. అలాగే నిత్యం పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడం, చిత్రాలు చూడటం వంటి అలవాట్లు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

కొత్తదనం ఎప్పటికప్పుడు మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. క్రాస్‌వర్డ్‌లు, సుడోకు, పజిల్‌లను పరిష్కరించడం వంటి బ్రెయిల్‌ గేమ్స్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

TV9 Telugu

కాన్‌సంట్రేషన్‌ కూడా పెరుగుతుంది. రెగ్యులర్ రైటింగ్ ప్రాక్టీస్ మెదడుకు మంచి వ్యాయామం. మీరు కవిత్వం రాయలేకపోతే, కనీసం డైరీ రాయడమైనా అలవాటు చేసుకోవాలి

TV9 Telugu

సంగీతం మన మెదడుపై విభిన్న ప్రభావాలను చూపుతుందని వివిధ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇది నాడీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సంగీతం వినడం వల్ల కూడా మెదడు ఉత్తేజితమవుతుంది

TV9 Telugu

రెగ్యులర్ మెడిటేషన్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒక విషయంపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి రెగ్యులర్ మెడిటేషన్ కూడా నరాలను బలోపేతం చేసేందుకు మంచి అలవాటుగా చెప్పవచ్చు