ఎర్ర బెండకాయలు కనిపిస్తే అస్సలు వదిలి పెట్టకండి..! లాభాలు బోలెడు
Jyothi Gadda
14 August 2024
మనందరం ఆకుపచ్చ బెండకాయలను ఎక్కువగా చూస్తుంటాం. కానీ, ఎర్ర బెండకాయలు చాలా అరుదు. ఈ ఎర్ర బెండకాయలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండిస్తుంటారు. ఈ బెండకాయలో పోషక విలువలు దాగి ఉన్నాయి.
ఎర్ర బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితోపాటు థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.
ఎర్ర బెండకాయలలో క్యాలరీలో పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల ఈ ఎర్ర బెండకాయలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎర్ర బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
ఇందులో ఉన్నటువంటి పాలీ ఫినాల్స్ ఫ్లవనాయి కారణంగా అలసట నీరసం తొలగిపోవడమే కాకుండా శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతారు. ఇందులో ఉండే విటమిన్ల కారణంగా కంటి చూపు మెరుగపడుతుంది.
చర్మ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఇక ఈ బెండకాయలలో పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఈ విధంగా గ్లూకోస్ స్థాయిలు నియంత్రించడం వల్ల మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పదార్థాలు మన శరీరంలో ఎముకలను దృఢ పరుస్తుంది.
మన శరీరంలో జీవ క్రియలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయి. ఇలా సాధారణ బెండకాయలతో పోలిస్తే ఈ ఎర్ర బెండకాయలు అధిక శాతం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
ఇక మహిళలు పీరియడ్స్ వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక చాలా మంది వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది.