ఇస్త్రీ చేయకుండానే బట్టలు మెరిపించొచ్చు.. ఎలాగంటే?

20 September 2024

TV9 Telugu

TV9 Telugu

ఇస్త్రీచేస్తే బట్టలు కొత్తవాటిలా మెరుస్తాయి. అందుకే పట్టు బట్టలను ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే ఇంట్లోనే ఇస్త్రీ చేసుకుంటూ ఉండాలి. దీంతో బట్టలు ఎప్పటికీ కొత్తవాటిలానే కనిపిస్తాయి

TV9 Telugu

నేటి కార్పొరేట్ ఆఫీసుల్లో డ్రెస్ కోడ్‌లు పాటిస్తున్నాయి. చాలా కార్యాలయాల్లో సూట్‌బూట్‌లు సర్వసాధారణం. అంటే బట్టలు ఎప్పుడూ ఇస్త్రీలోనే ఉండాలి. ముడతలు పడిన దుస్తులు ధరించకూడదు

TV9 Telugu

దీంతో చాలా మంది బిగుతైన సూట్‌ దుస్తులు ధరిస్తున్నారు. సాధారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి. సమయానికి ఇంట్లో కరెంట్‌ లేకపోవడమో, ఇస్త్రీ పెట్టె చెడిపోవడమో జరిగితే ఎలా?

TV9 Telugu

ఈ సింపుల్‌ ఇంటి ట్రిక్స్‌తో ఇస్త్రీ చేయకపోయినా బట్టలు నీట్‌గా ధరించవచ్చు. బట్టలు ధరించేటప్పుడు కాలర్ ముడతలు పడినట్లు మీరు గమనించినట్లయితే, అప్పుడు ఓ హెయిర్ డ్రైయర్‌తో ఈ సమస్యను  చక్క బెట్టొచ్చు

TV9 Telugu

బట్టల మడతలపై కొద్దిగా చల్లటి నీళ్లను చిలకరించి వాటిపై హెయిర్ డ్రైయర్‌ను నడపితే ముడతలు క్షణాల్లో మాయమవుతాయి

TV9 Telugu

వస్త్రాన్ని ఓ టేబుల్‌పై పరవాలి. దానిపై తడి టవల్‌తో అద్దడం ద్వారా మడతలు తొలగిపోతాయి. చివరగా డ్రైయర్‌తో బట్టలు ఆరబెడితే ఇస్త్రీ చేసినట్లే ఉంటుంది

TV9 Telugu

ముడతలు పడిన దుస్తులను సరిచేయడానికి కూడా హెయిర్ స్ట్రెయిట్‌నర్లను ఉపయోగించవచ్చు. దుస్తులపై కొంచెం నీరు చల్లి వస్త్రాన్ని తడి చేయాలి. ఆ తరువాత జుట్టును స్ట్రెయిట్‌నర్‌తో స్ట్రెయిట్ చేసినట్లు బట్టలను ఇస్త్రీ చేస్తే సరి

TV9 Telugu

ఓ చెంబులో వేడి నీటిని తీసుకుని, టేబుల్‌పై బట్టలను పరిచి ఇస్త్రీ చేయాలి. కొద్దిసేపటికే బట్టలు బిగుతుగా ఉంటాయి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతి