ఆభరణాలు అంటే ఇష్టపడని మగువలు ఉండరు. సందర్భం ఏదైనా నచ్చిన నగలు అలంకరించుకుని సంబరపడిపోతుంటారు
డ్రెస్సింగ్ స్టైల్‌కు తగ్గట్టు రకరకాల మోడల్స్, మ్యాచింగ్ అభరణాలంటూ తెగ కొనేస్తుంటారు. బంగారు నగలతోపాటు మెటల్ ఆభరణాలు దరిస్తుంటారు
అయితే గిల్టు నగలు కొందరికి పడవు. వీటి తయారీలో వాడే కొన్ని మెటల్స్ కారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ముచ్చట కొద్దీ వేసుకున్నా.. అలర్జీ, దురద, మంట ఇబ్బంది పెడుతుంటాయి
ఈ అలెర్జీల కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ కింది చిట్కాలు పాటిస్తే సులువుగా బయటపడొచ్చు
ఆర్టిఫిషియల్ నగలు ధరించే ముందు ఆ ప్రదేశంలో పౌడర్, మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకుంటే సరి. ఇవి మెటల్ ఎఫెక్ట్ చర్మంపై పడకుండా రక్షిస్తాయి
లేదంటే ఆ ప్రదేశంలో కలబంద గుజ్జు రాసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి ఉపశమనం కలిగించి దురద, దద్దుర్లు రాకుండా నివారిస్తుంది
నగలు ధరించే ముందు వాటిపై ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ వేస్తే.. మెటల్ ప్రభావం చర్మంపై పడదు. ఫలితంగా చర్మంపై అలెర్జీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది
నగలు తీశాక అలానే భద్రపరిచి, తిరిగి ధరించినా సమస్యకు కారణం అవుతుంది. నగలు తీసిన తర్వాత, అవి ఆరిన తర్వాత స్టోర్ చేయడం మంచిది