చీమలు ఇంట్లో ఉండే ఆహారపదార్థాల చుట్టూ చేరి చికాకు పెడుతుంటాయి. ఇంతేకాకుండా తోటలో మొక్కలపై చేరి వాటికీ హాని చేస్తుంటాయి
TV9 Telugu
ఇక ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఇంటి చుట్టూ చీమల సంచారం మరీ ఎక్కువగా ఉంటుంది. బిస్కెట్ల బాక్స్ నుంచి స్వీట్ల వరకు అన్ని చోట్లా చీమలు నానా కంపరం పుట్టిస్తుంటాయి
TV9 Telugu
చీమలను చంపడానికి రసాయనాలను ఉపయోగించడం, సుద్ద ముక్కలను గీయడం వంటివి కూడా ఈ మధ్య సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మరైతే ఏం చేయాలని అనుకుంటున్నారా?
TV9 Telugu
మీ వంటగదిలోని కొన్ని వస్తువులతో సమస్యకు సులువుగా పరిష్కారం ఇవ్వొచ్చు. క్రిమిసంహారక రసాయనాలకు బదులుగా, ఇల్లు శుభ్రపరిచే నీటిలో వెనిగర్ కలపాలి. ప్రతిరోజూ దీనితో ఇంటి నేలను శుభ్రం చేస్తేసరి
TV9 Telugu
చీమలు అధికంగా ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. అలాగే చక్కెర గిన్నెలో చీమలు చేరితే.. అందులో రెండు లవంగాలను వేసి చూడండి. చీమలు ఎక్కువగా ఉన్న చోట కూడా లవంగాలు వేసినా పని చేస్తాయి
TV9 Telugu
చీమలు సోకిన ప్రదేశంలో లవంగాలు, దాల్చిన చెక్క పొడి చల్లినా ఫలితం ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత దాని ఘాటు తగ్గితే శుభ్రం చేసి, మళ్లా చల్లుకుంటే సరిపోతుంది
TV9 Telugu
చక్కెర కంటైనర్‌లో నిమ్మ తొక్క ముక్కలు ఉంచినా ఫలితం ఉంటుంది. చీమలు నిమ్మకాయల వాసనకు పారిపోతాయి. ఈ చిట్కా పాటిస్తే చీమల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
చీమలు తేనె కనిపిస్తే దానిలోకీ చేరిపోతుంటాయి. ఆ సీసాలో నాలుగైదు మిరియాలు వేసి చూడండి. ఆ బెడద ఉండదు. సిట్రస్ ఆధారిత పండ్లు చీమలను తొలగించడంలో బలేగా ఉపయోగపడతాయి