CAA ద్వారా భారతీయ పౌరసత్వం ఎలా పొందాలి..?

TV9 Telugu

20 March 2024

భారతదేశం 31 డిసెంబర్ 2014లోపు దరఖాస్తు చేసుకున్న వారికి CAA ద్వారా భారతీయ పౌరసత్వం పొందవచ్చు అని కేంద్రం తెలిపింది.

CAA ద్వారా భారతీయ పౌరసత్వం పొందాలంటే దరఖాస్తును https://Indiancitizenshiponline.nic.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

దరఖాస్తుదారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ధృవీకరణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన సంవత్సరాన్ని సూచించాలి.

భారతదేశానికి చేరుకున్న తేదీ, వీసా లేదా ఇమ్మిగ్రేషన్ స్టాంప్ సమాచారాన్ని ఆ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.

దరఖాస్తుదారులు షెడ్యూల్-1A, షెడ్యూల్-1B, షెడ్యూల్-1C కింద డాక్యుమెంట్లను ఫారమ్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారునికి సంబంధించిన పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్‌తో సహా పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

పోర్టల్‌లో సూచించిన ప్రతి పత్రం తప్పని సరి అవసరం లేదు పత్రాలు లేనట్లయితే, అందుకు గల కారణాలు పేర్కొనాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ధృవీకరణ, అధికారుల సంతృప్తి తర్వాత CAA 15 డిజిటల్ సర్టిఫికేట్ పొందుతారు. తద్వారా భారతీయ పౌరసత్వం దక్కుతుంది.