మీరు వాడే వంటనూనె మంచిదా.. కల్తీనా? ఇలా తెలుసుకోండి
June 12, 2024
TV9 Telugu
TV9 Telugu
మనం వాడే వంటనూనె మంచిదా, నకిలీదా అనే విషయం చెక్ చేసుకోవాలని చాలా మందికి తెలియదు. కల్తీ వంటనూనెల వినియోగం క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులకు కారణం అవుతాయి
TV9 Telugu
అయితే చాలా మందికి వీటిని ఎలా గుర్తించాలి అనే విసయం తెలియదు. ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం మన ఆరోగ్య, ఆర్థిక కారణాలకు చాలా ముఖ్యం
TV9 Telugu
సాధారణంగా ప్రతి ఇంట్లో పండుగొచ్చిందంటే నూనెలు తెగ కాగాల్సిందే! శుద్ధమైన పల్లీనూనె సలసల మసులుతుంటే.. ఆ పరిమళం వాడకట్టునంతా కట్టిపడేస్తుంది
TV9 Telugu
కానీ కల్తీ నూనెలు రాజ్యమేలడం మొదలయ్యాక ఆ సువాసనలు మాయమైపోయాయి. దీనికంతటికీ కల్తీ నూనే కారణం. అయితే ఏది మంచి నూనో, ఏది కల్తీ నూనో కనిపెట్టడం బ్రహ్మవిద్యేం కాదు. చిన్నచిన్న చిట్కాలతో ఇట్టే తెలుసుకోవచ్చు
TV9 Telugu
ఒక తెల్ల కాగితం తీసుకొని.. కొద్దిగా నూనె వేసి ఆరబెట్టాలి. నూనె స్వచ్ఛమైనది అయితే.. అది వృత్తంలాగా వ్యాపిస్తుంది. అదే నకిలీదైతే పేపర్‌పై పూర్తిగా ఇంకిపోకుండా పక్క దారులకు పాకుతుంది
TV9 Telugu
ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. స్వచ్ఛమైన నూనైతే ఘనీభవిస్తుంది. కల్తీదైతే అలాగే ద్రవరూపంలో ఉంటుంది. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ ఫ్రీజర్‌లో ఉంచితే 30 నిమిషాల్లో గడ్డ కడుతుంది. అలా కాలేదంటే అది కల్తీనే
TV9 Telugu
స్వచ్ఛమైన పల్లీనూనె సువాసన కలిగి ఉంటుంది. కల్తీదైతే.. కాస్త చేదు వాసన వస్తుంటుంది. అంతేకాదు కల్తీనూనె కాస్త చిక్కగా ఉంటుంది. ఈ విషయాలు పరిశీలించి కల్తీనూనె బారినపడకుండా జాగ్రత్తపడండి
TV9 Telugu
కొనుగోలు చేసే నూనె మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉంది. కల్తీ లేని నూనెలు ఒక నిర్దిష్టమైన సహజమైన సువాసనను కలిగి ఉంటాయి. కల్తీ లేని నూనె అయితే దానికి సువాసన ఉండదు