సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఇలా వాడితే..

Jyothi Gadda

23 November 2024

TV9 Telugu

సీతాఫలం ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.

TV9 Telugu

విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం ఎన్నో ఖనిజాలు, పోషకాలు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాలకు నివారణగా పనిచేస్తాయి. 

TV9 Telugu

సీతాఫలం పండులోనే కాదు.. సీతాఫలం చెట్టు ఆకుల్లో కూడా బోలెడు పవర్ ఉంది. ఈ ఆకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. 

TV9 Telugu

ఈ ఆకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సీతాఫలం ఆకులు డయాబెటిస్ పేషంట్లకు ఓ వరం అని చెప్పవచ్చు.

TV9 Telugu

ఈ ఆకులు రక్తంలో షుగర్ స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరగబెట్టి.. ఆ నీటిని తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి, ఇది ఇన్సూలిన్‌గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

TV9 Telugu

ఈ ఆకులో పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు.

TV9 Telugu

ఈ ఆకును మెత్తగా పేస్టులా చేసి చర్మంపై అప్లై చేయాలి. మొటిమలు, ఎర్ర దద్దుర్లు, మంట, తామర వంటి లక్షణాల్ని ఈ పేస్టు అప్లై చేయడం వల్ల తగ్గుముఖం పడతాయి. 

TV9 Telugu

సీతాఫలం ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చలికాలంలో సీతాఫలం ఆకుల పేస్టు ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముఖం నిగనిగలాడుతుంది.

TV9 Telugu