గుమ్మడి గింజలతో గుండె ఆరోగ్యానికి ఢోకా లేనట్లే!

09 July 2024

TV9 Telugu

TV9 Telugu

క్యారెట్లు, చిలగడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ బీటా కెరొటిన్‌ దండిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్‌ ఎ రూపంలోకి మారిపోతుంది

TV9 Telugu

అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్‌ ఎ లభిస్తుంది. కళ్లు బాగా కనబడటానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్‌ ఎ చాలా అవసరం

TV9 Telugu

గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికీ ఇది దోహదం చేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ విటమిన్‌ ఎ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

TV9 Telugu

అయితే గుమ్మడి కాయ తింటే మంచిదని తెలుసు గానీ, అందులోని గింజలకూ ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు. కానీ, వీటిని రోజూ ఓ చెంచా తింటే గుండె ఆరోగ్యానిక ఢోకా ఉండదంటున్నారు

TV9 Telugu

గుమ్మడి గింజల్లో ఫైబర్‌ ఎక్కువ. జీర్ణసంబంధిత సమస్యలూ, అధికబరువు... వంటివాటితో బాధపడేవారు రోజూ ఓ చెంచా గింజల్ని తినండి. వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది

TV9 Telugu

దీంతో అతిగా ఆహారం తినే అలవాటుని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువూ తగ్గుతారు. అలానే జీర్ణ ప్రక్రియనూ మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌-ఇ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కణాలను అడ్డుకుంటాయి. యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు గుమ్మడి గింజల్లో ఉంటాయి.  ముఖ్యంగా వీటిల్లో ఉండే ట్రైగోనిలైన్, నికోటినిక్‌ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్‌ అనే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయులు క్రమబద్దీకరిస్తాయి

TV9 Telugu

గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, జింక్‌ మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా మెగ్నీషియం బీపీని నియంత్రించి, గుండెకి రక్షణగా పనిచేస్తే,  జింక్‌.. శరీరం విటమిన్లనీ, ఖనిజాలనీ గ్రహించడంలో సాయపడుతుంది