వేసవిలోనూ చర్మ సంరక్షణ అవసరమే..!

March 07, 2024

TV9 Telugu

శీతాకాలంలోనే కాదు.. వేసవిలోనూ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. వంటి ఎన్నో సమస్యలు వేసవిలో ఇబ్బంది పెడతాయి

వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి ఈ కింది సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే సరిపోతుంది. చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే వాటిలో మృత కణాలు కూడా ముఖ్యమైనది

వీటివల్ల చర్మం డల్‌గా కనిపించడమేకాకుండా ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి

అందుకే సౌందర్య సంరక్షణలో భాగంగా వీటిని తొలగించుకోవడం చాలా అవసరం. ఇందుకోసం స్నానం చేయడానికి ముందే ఏదైనా ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి

ఆ తర్వాత స్నానం చేసే సమయంలో చర్మతత్వానికి సరిపోయే స్క్రబ్ సహాయంతో మృత కణాలను తొలగించుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ కలగదు

అలాగే చర్మంపై అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ముందు, ఆ తర్వాత ఆ ప్రదేశంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లను ఎంపిక చేసుకోవాలి

వీటిలోని గ్లిజరిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. అలాగే వ్యాక్సింగ్ చేయించుకునే వారు కనీసం 15 రోజులైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి

షేవ్ అనంతరం పూల్స్, బీచ్‌లలోని నీటిలో ఈతకొట్టక పోవడం మంచిది. దీనివల్ల ఆ నీటిలోని క్లోరిన్, ఉప్పు, సూర్యరశ్మి చర్మంపై ట్యాన్ వచ్చేలా చేస్తాయి. కనీసం 24 గంటల సమయం తీసుకోవాలి