స్వీట్ పొటాటో, కందగడ్డ, చిలగడదుంప ఇవన్నీ దీనికి పేర్లు..ఈ తియ్యని దుంపను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.. ఇది కాల్చినా, ఉడకబెట్టినా దాని రుచి అద్భుతంగా ఉంటుంది.
TV9 Telugu
స్వీట్ పొటాటోలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఫైబ్రినోజెన్ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది.
TV9 Telugu
చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్, విటమిన్-ఈ, సి, బి-6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ D అధికంగా అతికొద్ది ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి.
TV9 Telugu
చిలగడ దుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ బాగుండేలా చేస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
TV9 Telugu
చిలగడదుంపల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగు చేస్తుంది.
TV9 Telugu
చిలగడదుండలో కెరొటినాయిడ్స్, విటమిన్ ఏ వంటివి పోషకాలు కంటిచూపుని మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయల్నీ తగ్గిస్తాయి.
TV9 Telugu
చిలగడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్‌లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది.
TV9 Telugu
చిలగడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్‌లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది.