07 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
మన శరీరంలో దాదాపు 70 శాతం నీరు ఉంటుంది. నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము
నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా శరీరానికి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో కనీసం 7 నుండి 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఇది శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతుంది
వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పొడిగా ఉంది దాహం లేదని నీరు తాగడం తగ్గిస్తే అనారోగ్యమే.. కనుక 12 గంటల్లో ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండేందుకు ఒక వ్యక్తి రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. కనుక రోజూలో 12 గంటల వ్యవధిలో 1.5 లీటర్ల నీరు త్రాగాలి.
ఎవరైనా సరే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్లయితే శరీరానికి తగినంత నీరు త్రాగాలి. ఇలా చేయడం వలన అనేక లాభాలున్నాయి.
ఎవరైనా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటే కాలంతో పని లేకుండా పుష్కలంగా నీరు త్రాగండి. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.