వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరబ్బ. కానీ, ఇప్పుడంతా కెలొరీల లెక్కే. అందుకే, కాస్త ఘాటెక్కువగా ఉన్న కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా... వద్దనేస్తున్నాం
TV9 Telugu
కానీ రోజూ ఒక చెంచా నెయ్యి తింటే మేలంటున్నాయి పలు అధ్యయనాలు. నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది
TV9 Telugu
అయితే రోజూ అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు. నెయ్యి శరీరంలోని శక్తి లోటును భర్తీ చేస్తుంది
TV9 Telugu
ఇందులో కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నెయ్యి తీసుకోవడం ద్వారా శరీరం పోషకాలను గ్రహించి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది
TV9 Telugu
నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచుగా వ్యాధులతో బాధపడేవారు, రోజూ ఆహారంలో ఒక చెంచా నెయ్యి తీసుకోవడ మంచిదే
TV9 Telugu
నెయ్యి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో తేమను నిలుపుకుంటుంది. అంతేకాకుండా నెయ్యి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
నెయ్యి గ్యాస్, గుండెల్లో మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నెయ్యిలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది
TV9 Telugu
అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నెయ్యి అధికంగా తింటే అనార్ధాలు తప్పవు. రోజుకి 1 టీస్పూన్ కంటే ఎక్కువ నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి