గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీ ఎంతో తెలుసా..?
TV9 Telugu
14 June 2024
ప్రస్తుతం అందరి ఇళ్లలో స్టవ్ ఉంది కాబట్టి వంట చేయడానికి ప్రతి ఇంట్లో సిలిండర్ ఉపయోగించడం తప్పనిసరి..!
మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా ? డెలివరీ ఛార్జీ ఎంత చెల్లించాలి.
ఇంట్లో సిలిండర్ అయిపోయినప్పుడల్లా ఆన్‌లైన్‌లో అఫీషియల్ యాప్ లేదా యూపీఐ యాప్స్ ద్వారా బుక్ చేసుకోవాలి.
మీరు బుక్ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే హాకర్లు వంట సిలిండర్ డెలివరీ చేసేందుకు మీ ఇంటి వద్దకు వస్తారు.
ఎలాంటి డెలివరీ ఛార్జీ లేకుండా సిలిండర్ మీ ఇంటికి డెలివరీ చేయాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో డెలివరీ ఛార్జీ వసూల్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసినప్పుడు సిలిండర్ ధరతో పాటు డెలివరీ ఛార్జీ రూ.19.50 పైసలు మొత్తం బిల్లుకు కలుపుతారు.
స్వయంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ తెచ్చుకునేందుకు వెళ్తే డెలివరీ ఛార్జ్ రూ.19.50 చెల్లించాల్సిన పనిలేదు.
సిలిండర్ డెలివరీ బాయ్ చార్జీ అడిగితే కచ్చితంగా ఇవ్వాల్సిన పని అయితే లేదు. మీకు ఇవ్వలిపిస్తే టిప్ రూపంలో తోచినంత ఇవ్వొచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి