చియా సీడ్స్ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో,అతిగా తీసుకుంటే అంతే నష్టాలు కూడా ఉన్నాయి. సాధారణంగా జీర్ణ సమస్యలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కానీ కొందరికి మాత్రం జీర్ణ సమ్యలు తెచ్చిపెడతాయి.
చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డయేరియా, గ్యాస్, కడుపులో నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దురద, స్వెల్లింగ్, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు.
చియా సీడ్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, క్యాలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అతిగా తింటే జీర్ణ సమస్య వస్తుంది.
కొంత మందికి చియా సీడ్స్ పడవు. ఇలాంటి వారు వాటిని ఎక్కువగా తీసుకుంటే చర్మ సమస్యలు, దురద వస్తుంది. చియా సీడ్స్ వల్ల రక్త పోటు తగ్గుతుంది. కావాల్సిన దాని కంటే బాగా తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
చియా సీడ్స్ చిన్న చిన్నవి కావడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కు పోయి, ఇబ్బంది పెడతాయి. వీటిని సరిగ్గా దంతాల మధ్య నుంచి తీయకపోతే సమస్యే.
చియా గింజలు పూర్తిగా నానబెట్టకుండా తింటే గొంతుపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల గొంతు నొప్పి రావచ్చు. తక్కువ నీటిలో ఎక్కువ గింజలు కలిపి తిన్నా ఇబ్బందే.
చియా సీడ్స్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణ అదుపు తప్పుతుంది. దీని వల్ల మధుమేహం ఉన్న వారికి ఇబ్బంది. చియా సీడ్స్‌లోని అధిక ఫైబర్ వల్ల ఇతర ఆహార పదార్థాల్లోని పోషకాలను గ్రహించకుండా చేస్తుంది.
ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని వల్ల రక్తాన్ని పల్చగా చేసే అవకాశం ఎక్కువ. చియా సీడ్స్‌ను అదే పనిగా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కేలరీలుశరీరానికి ఎక్కువయ్యే అవకాశం ఉంది.