భారత్‌లో ఎంతమంది మహిళలకు మరణశిక్ష విధించారు?

TV9 Telugu

05 February 2025

స్వతంత్ర భారతదేశంలో 1955లో తొలిసారిగా మరణ శిక్ష అమలు చేశారు. ముగ్గురు బాలికలను హత్య చేసిన నేరంపై రతన్ బాయి అనే మహిళను ఉరితీశారు.

తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో రతన్‌బాయి ముగ్గురు బాలికలను అతి దారుణంగా చంపేసింది.

రతన్ బాయి అరెస్ట్ తర్వాత నేరారోపణలు రుజువు కావడంతో భారతదేశం కోర్టు ఆమెకు జనవరి 1955లో మరణశిక్ష విధించింది.

2008లో షబ్నం మరణశిక్ష విధించిన రెండవ మహిళ. షబ్నం తన కుటుంబంలోని 7 మందిని చంపినందుకు దోషిగా నిర్ధారించింది కోర్టు.

షబ్నం తన ప్రేమికుడితో కలిసి తన సొంత కుటుంబ సభ్యలను హత్య చేసిందని భారతదేశంలోని ఓ కోర్టులో నేరం రుజువైంది.

అప్పట్లో రాష్ట్రపతి కూడా ఆమె క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె బరేలీ జైలులో మరణశిక్ష అనుభవిస్తున్నారు.

కేరళ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళ గ్రిష్మ తన ప్రేమికుడు షారన్ రాజ్‌ను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది.

తన ప్రేమికుడిని హతమార్చిన గ్రిష్మకు తిరువనంతపురం జిల్లాలోని నెయ్యట్టింకర కోర్టు మరణశిక్ష విధించింది.