ప్రపంచంలో ఎన్ని రకాల పులులు ఉన్నాయో తెలుసా..

TV9 Telugu

11 July 2024

పులి పాంథెరా జాతికి చెందినది. ఇది ఆసియా ఖండానికి చెందిన అతిపెద్ద పిల్లి జాతికి చెందిన ఓ క్రూర జంతువు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది రకాల పులులు ఉండేవి. కానీ ఇప్పుడు వీటిలో మూడు జాతులు అంతరించిపోయాయి.

మిగిలిన ఆరు జాతులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అంతరించిపోయిన జాతులలో బాలి టైగర్, కాస్పియన్ టైగర్, జావాన్ టైగర్ ఉన్నాయి.

బాలి టైగర్ ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో, జివా ద్వీపంలో జావాన్ పులులు, కాస్పియన్ టైగర్ కాస్పియన్ సముద్రం సమీపంలో ఉండేవి.

ప్రపంచవ్యాప్తంగా సజీవ జాతులలో బెంగాల్ టైగర్, సైబీరియన్, సుమత్రన్, దక్షిణ చైనా, ఇండో చైనీస్, మలయన్ పులులు ఉన్నాయి.

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. ప్రస్తుతం 3,167 పులులు ఉన్నాయి. గత నాలుగేళ్లలో సంఖ్య 200కి పైగా పెరిగింది.

2018తో పోలిస్తే 2022 నాటికి పులుల సంఖ్యలో 6.7 శాతం వృద్ధి నమోదైంది. 1875-1925 మధ్య దాదాపు 80 వేల పులులను చంపేసినట్టు అంచనా.

మన జాతీయ జంతువు అయిన పులి జాతి అంతరించిపోతుండటంతో భారత ప్రభుత్వం వీటి కోసం అనేక రక్షణ చర్యలు చేపట్టింది.