తుఫానులు ఎన్ని రకాలు?
TV9 Telugu
24 October 2024
సాధారణంగా భూమి ఉత్తర అర్ధ గోళంలో లోపలకి అపసవ్య దిశలో భ్రమించే సర్పిలాకార గాలులుగా, దక్షిణ అర్ధ గోళంలో సవ్య దిశలో భ్రమించే గాలులుగా పేర్కొంటారు.
ఎల్లప్పుడూ తక్కువ వాతావరణ పీడనం గల ప్రాంతాలపై తుఫాను కేంద్రీకృతమవుతాయి. అన్ని తుఫానులకు పలు నిర్మాణ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి.
అవి వెచ్చని మహాసముద్రాలపై ఏర్పడతాయి. అవి బలమైన గాలులు, భారీ వర్షం, తుఫానులతో వస్తాయని మనకి తెలిసిందే.
తుఫానులు ఒకే రకమైనవి. కానీ వాటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటో ఈరోజు చూద్దాం.
హరికేన్లు: అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాటిని హరికేన్లు అని పిలుస్తారు.
తుఫానులు: భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే వాటిని తుఫానులుగా భావిస్తారు ప్రాంతవాసులు.
టైఫూన్: పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే వాటిని టైఫూన్గా అక్కడి ప్రజలు, ప్రభుత్వ అధికారులు పిలుస్తారు.
ఇది కాకుండా, తుఫానుల తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు. వీటిని తీవ్రమైన తుఫాను, అతి తీవ్రమైన తుఫానుగా భావిస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి