నాన్‎వెజ్ రిఫ్రిజిరేటర్‌లో ఎన్ని రోజులు ఉంచాలి.? నిపుణుల మాటేంటి.?

Prudvi Battula 

Images: Pinterest

01 December 2025

ఉడికించని చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో 1 లేదా 2 రోజులు నిల్వ చేయవచ్చు. గాలి చొరబడని కంటైనర్‌లో దిగువన ఉన్న షెల్ఫ్‌లో నిల్వ చేయండి.

చికెన్

ఉడికించిన చికెన్‌ను 3 నుండి 4 రోజులు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. అది బాగా చల్లబడిన తర్వాత మాత్రమే రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.

ఉడికించిన చికెన్

ఉడికించని చేపలు చాలా త్వరగా చెడిపోతాయి. వాటిని గరిష్టంగా 1 (లేదా 2) రోజులు మాత్రమే రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి.

చేప

వండిన చేపలు రిఫ్రిజిరేటర్‌లో 3 నుండి 4 రోజులు బాగా నిల్వ ఉంటాయి. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

వండిన చేప

ఇతర మాంసాలతో పోలిస్తే మటన్ చాలా కాలం పాటు బాగా నిల్వ ఉంటుంది. దీనిని 3 నుండి 5 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.

మటన్

వండిన మటన్‎ను రిఫ్రిజిరేటర్‌లో 4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఇది త్వరగా చెడిపోదు. నిర్భయంగా ఉంచవచ్చు.

ఉడికించిన మటన్

ఫ్రీజర్‌లో ఉంచితే ఎక్కువ కాలం ఉంటాయి. చికెన్ 9 నెలలు, చేప 3 నుండి 6 నెలలు, మటన్ 6 నుండి 12 నెలలు వరకు మంచిగా ఉంటాయి.

ఫ్రీజర్ వాడకం

మీరు దుర్వాసన, జిగటగా, బూడిద (లేదా) ఆకుపచ్చగా మారడం లేదా బూజు పెరగడం గమనించినట్లయితే, వెంటనే దాన్ని పారవేయండి.

చెడిపోయిన మాంసాన్ని గుర్తించడం