నీళ్లలో చియా విత్తనాలను ఎన్ని నిమిషాలు నానబెట్టాలి?
03 September 2024
TV9 Telugu
TV9 Telugu
చాలా మంది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి చియా సీడ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ చియా విత్తనాలను తినడానికి సరైన మార్గం చాలా మందికి తెలియదు
TV9 Telugu
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ సరైన రీతిలో వీటిని తీసుకోకపోతే ప్రయోజనం ఉండదు
TV9 Telugu
చియా విత్తనాలను పచ్చిగా తినడం వల్ల ప్రయోజనం ఉండదు. చియా విత్తనాలను తినడానికి సరైన మార్గం.. నీటిలో నానబెట్టడం. పాలు లేదా పెరుగులో కూడా వీటిని నానబెట్టి తినవచ్చు
TV9 Telugu
చియా గింజలను నీటిలో లేదా పాలలో నానబెడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. నానబెట్టిన చియా గింజలను తినడం ద్వారా, ఈ గింజల్లోని పోషకాలు శరీరం శోషించుకుంటుంది
TV9 Telugu
చియా గింజలను 1:3 నిష్పత్తిలో నీరు లేదా పాలలో వేసి నానబెట్టాలి. 1 గ్లాసుడు నీరు లేదా పాలలో 1 టీస్పూన్ చియా గింజలను తీసుకుంటే సరిపోతుంది. ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి
TV9 Telugu
చియా గింజలను నీటిలో లేదా పాలలో కలిపిన తర్వాత 20 నిమిషాలపాటు నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన చియా గింజలను తినడానికి ముందు ఒక చెంచాతో మొత్తం ఒక్కసారి కలపాలి
TV9 Telugu
చియా గింజలను పెరుగుతో కూడా కలిపి తినవచ్చు. నానబెట్టిన చియా గింజలు, పెరుగు, పండ్లు, నట్స్ మొదలైన వాటితో స్మూతీలను తయారు చేసుకొని సేవించవచ్చు. వేయించిన చియా విత్తనాలను కూడా వీటిపై జల్లుకుని తినవచ్చు
TV9 Telugu
చియా గింజలను పొడి పాన్‌లో వేయించుకుని పెరుగు, వోట్‌మీల్ లేదా సలాడ్‌పై స్ప్రెడ్‌గా తినవచ్చు. అయితే తర్వాత ఎక్కువ నీళ్లు తాగడం మర్చిపోకూడదు