ఎండు మిర్చీతో చేసిన కారం కన్నా పచ్చి మిరప ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగని అతిగా తింటే మాత్రం డేంజరే
TV9 Telugu
పచ్చి మిర్చిలో విటమిన్ ఎ, బి6, కె అధికంగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఫోలెట్, పొటాషియం, థయామిన్, ఐరన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
కొందరు పచ్చి మిరపకాయలను వివిధ వంటలలో వేసి వీటి రుచులను ఆస్వాధిస్తుంటారు.. అయితే చాలా మంది వీటిని చూసి దూరంగా పారిపోతుంటారు
TV9 Telugu
నిజానికి, రోజువారీ ఆహారంలో పచ్చి మిరపకాయలను ఉంచుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి మిరపకాయలను తినడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చట
TV9 Telugu
పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఈ పదార్ధం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి మిర్చి బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
పచ్చి మిర్చిలో విటమిన్ సి, ఎ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది
TV9 Telugu
పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ శారీరక నొప్పులను తగ్గిస్తుంది. శారీరక మంట, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. పచ్చి మిర్చిలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అంతేకాకుండా, ఇవి చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పచ్చి మిర్చి తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు