ఏసీ నుంచి వచ్చే నీటిని ఇలా కూడా వాడుకోవచ్చా..!

TV9 Telugu

07 June 2024

ఏసీ రన్ చేసిన తర్వాత అందులో నుంచి నీరు వస్తుంది, దీన్ని చాలా మంది వృధా చేస్తారు, అయితే ఈ నీరు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసా..?

ఏసీ నుంచి వచ్చే నీటిని వృథా చేయకండి అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ స్పెషల్ టిప్స్ ఇచ్చారు.

వేసవిలో దేశంలోని అనేక నగరాల్లో ఇది చాలా వేడిగా ఉంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీ వాడుతూ ప్రశాంత పొందుతున్నారు.

ఆనంద్ మహీంద్రా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా X ప్లాట్‌ఫారమ్‌లో AC నీటిని ఆదా చేయడానికి ఒక ఉపాయాన్ని పంచుకున్నారు.

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, ఏసీ నుండి వచ్చే నీరు మందపాటి పైపులో నిల్వ చేయాలని చెప్పారు.

దానికి అమర్చిన ఈ పైపు దిగువన ఒక ట్యాప్ ఏర్పాటు చేయాలి. వినియోగదారులు తమకు కావలసినప్పుడు ఆ నీటిని ఉపయోగించవచ్చు.

ఏసీ నుంచి వచ్చే నీటిని చాలా చోట్ల వాడుకోవచ్చు. ఈ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి మొదలైన వాటికి ఉపయోగించవచ్చు.

ఏసీ నుంచి వచ్చే ఈ నీటిని మొక్కలకు వేయాలా వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖనిజాలు లేనందున ఈ నీరు తాగడానికి పనికిరాదు.