తేనె, మిరియాలు కలిపి తింటే ఏమవుతుందంటే.. 

20 November 2024

 Pic credit - Getty

TV9 Telugu

శీతాకాలంలో వంటలలో మసాలాల వాడకం పెరుగుతుంది. లవంగాలు, యాలకులు, ధనియాలు, ఎండుమిర్చి అనేక మసాలాలు గృహ నివారణ చిట్కాలలో ఉపయోగిస్తారు.

వంటగది సుగంధ ద్రవ్యాలు

ఈ రెండూ ఔషధాలుగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.

నిపుణుల అభిప్రాయం

తేనె, నల్ల మిరియాలు కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సాధనం. ఈ సీజన్ లో ఒకటి లేదా రెండు నల్ల మిరియాలు కలిపి 1 టీస్పూన్ తేనె తినండి.

రోగనిరోధక శక్తి

మీకు గొంతు నొప్పి సమస్య బాధిస్తుంటే వంట ఇంట్లో లభించే ఉత్తమమైన చికిత్స. రోజూ నల్ల మిరియాలు తేనెతో కలిపి తినడం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గొంతు నొప్పి

ఈ సీజన్ లో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కనుక జీర్ణ క్రియ బలహీనంగా ఉన్నా తేనె, మిరియాలు కలిపి తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ

బరువు పెరగడం అనే సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. తేనె మిరియాల పొడిని వేడి నీటిలో కలిపి తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

అదుపులో బరువు