మోకాళ్లలో టక్ టక్ అని శబ్ధం వస్తుందా? ఇది ఆ ప్రమాదానికి సంకేతం..!

15 August 2023

మోకాళ్ల నుంచి కొన్ని సందర్భాల్లొ టక్ టక్ అని శబ్ధం వస్తుంది. అది తీవ్ర సమస్యకు ముందు వచ్చే సంకేతం అని చెబుతున్నారు వైద్యులు.

జాయింట్స్ పెయిన్

ఈ సమస్యను ముందే గ్రహిస్తే సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చునని చెబుతున్నారు వైద్యులు. మరి మోకాళ్లను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

జాయింట్స్ పెయిన్

మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్ల నుంచి శబ్ధం వస్తుంది. దాంతో చాలా మంది భయపడిపోతారు. నిజమే.. ఇలా రావడం భవిష్యత్‌లో సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మెట్లు ఎక్కడం కష్టంగా మారుతుంది.

జాయింట్స్ పెయిన్

శరీరంలోని మోకాళ్ల నుంచి లేదా ఇతర కీళ్ల నుంచి కట్ కట్ శబ్ధం రావడం శరీరంలో విటమిన్ డి, క్యాల్షియం లోపానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య తగ్గాలంటే సరైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

జాయింట్స్ పెయిన్

వయసు పెరిగే కొద్ది మోకాళ్లలో ఉండే జిగట పదార్థాం తగ్గుతుంది. ఈ స్థితిలో మోకాళ్లలో శబ్దం రావడం ప్రారంభమవుతుంది. చిన్న వయసులో ఈ సమస్య రావడం పెద్ద వ్యాధులకు సంకేతంగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

జాయింట్స్ పెయిన్

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. అది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని చాలా నివేదికల్లో వెల్లడైంది. అందుకే.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీనిపై మరిన్ని పరిశోధలు జరుగుతున్నాయి.

జాయింట్స్ పెయిన్

విటమిన్ డి,  కాల్షియం లోపం వల్ల మోకాళ్లలో శబ్దం రావడమే కాకుండా ఎముకల్లో తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. మీరు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

జాయింట్స్ పెయిన్

అధిక బరువు పెరగడం వల్ల కూడా ఎముకలు, జాయింట్స్ పెయిన్ సమస్య వస్తుంది. శరీర బరువు మోకాళ్లపై పడటం వలన కూడా మోకాళ్ల నొప్పి వస్తుంది. పాదాల నొప్పికి బరువు పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు కూడా చెబుతున్నారు.

జాయింట్స్ పెయిన్

మోకాళ్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఒమేగా - 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న వాటిని తినాలి. ఇందుకోసం ఆక్రోట్స్ తినొచ్చు. అయితే, దీనిని పరిమితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

జాయింట్స్ పెయిన్