ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టే హోమ్ రెమెడీస్..  

13 August 2023

రోజంతా కూర్చొని పనిచేయడం, సరైన భంగిమలో నిద్రించకపోవడం వల్ల అనేక మంది ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.

అలాంటివారు మార్కెట్‌లో లభించే మెడిసిన్స్ కాకుండా కొన్ని హోమ్ రెమెడీస్‌ని ఫాలో అయితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

మరి ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏయే హోమ్ రెమెడీస్‌ని పాటించాలో ఇప్పుడు చూద్దాం..

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఈ కారణంగానే అల్లంను వేడినీటిలో మరిగించి తాగితే ఫలితం ఉంటుంది.

పసుపులోని ఔషధ గుణాలు అన్నీఇన్నీ కాదు. గ్లాస్ వేడి నీళ్లలో చెంచా పసుపు వేసుకుని తాగితే అన్ని రకాల నొప్పులు పోతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్‌లో, తేనెను కలిపి తాగినా కూడా చక్కని ఫలితాలు ఉంటాయి. అందుకోసం మీరు వేడినీటిని ఉపయోగించండి.

రాత్రి భోజనం తర్వాత చిన్ని బెల్లం ముక్క తినండి. ఉదయం లేచేసరికి అన్ని రకాల నొప్పులు మాయమైపోతాయి.

కప్పు ఆవ నూనెలో 4 లవంగాలు, వెల్లుల్లి వేసి బాగా మరిగించండి. చల్లారిన తర్వాత నొప్పి ఉన్న ప్రాంతంలో మర్ధన చేస్తే చక్కని ఫలితాలు ఉంటాయి.