గురక పెట్టేవారి దగ్గర నిద్రపోయేవారి నిద్ర చెడిపోతుంది. ఇంట్లో ఎవరైనా గురక పెడుతుంటే కొన్ని సింపుల్ టిప్స్ తో నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
గోరువెచ్చని నీటిలో పుదీనా నూనె వేసి ఆ నీటిని పుక్కిలిస్తే గురక సమస్య క్రమంగా తగ్గుతుంది. లేదా గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించి తాగినా సమస్య తగ్గుతుంది.
గోరువెచ్చని నీటిలో పుదీనా నూనె వేసి ఆ నీటిని పుక్కిలిస్తే గురక సమస్య క్రమంగా తగ్గుతుంది. లేదా గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించి తాగినా సమస్య తగ్గుతుంది.
గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలపి తాగండి. ఇలా రోజూ తాగడం వలన క్రమంగా గురక సమస్య అదుపులోకి వస్తుంది.
నిద్ర పోయే ముందు గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి వేసి ఆ నీటిని తాగి వెల్లుల్లిని మింగాలి. ఈ టిప్ గురక నుంచి ఉపశమనం ఇస్తుంది.
ప్రతిరోజూ నిద్ర పోయే ముందు ఆలివ్ ఆయిల్‌ను ముక్కుకు అప్లై చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు గురక సమస్య కూడా క్రమంగా దూరం అవుతుంది.
దేశీ ఆవు నెయ్యిని కొంచెం వేడి చేసి ఆ నెయ్యి కొన్ని చుక్కలను ముక్కుల్లో వేసుకోవాలి. దీంతో గురక సమస్య నయం అవుతుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు వేడి పాలలో లేదా నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పసుపును కలిపి తాగితే గురక సమస్య తగ్గుతుంది