చలికాలంలో పాదాల పగుల్లా? ఈ చిన్న పని చేస్తే ఉపశమనం   

18 November 2024

 Pic credit - Getty

TV9 Telugu

శీతాకాలం వచ్చింది. ఈ సీజన్ అంటే చాలా మందికి సంతోషం.. వాకింగ్, నులి వెచ్చని సూర్యరశ్మిని ఇష్టపడతారు.

అయితే చలికాలంలో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సీజన్ లో జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి రకరకాల సమస్యలు మొదలవుతాయి.

చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఒకటి. పాదాల నొప్పికి అంతు ఉండదు. చలికాలం వచ్చిందంటే మడమ నుంచి అరికాలి వరకు పాదాల భాగం పగుళ్లు ఏర్పడుతుంది.

కాలు పగిలితే నడవడం కష్టం. కనుక ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. అది ఎలా అంటే 

ఎక్కువ సమయం నడిచే వారు లేదా ఎక్కువ సేపు నిలబడి ఉండేవారు పాదాల పగుళ్లతో ఇబ్బంది పడతారు. ఒకొక్కసారి పగిలిన భాగం నుంచి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంది.  

చలికాలంలోపాదాల పగుళ్లతో బాధపడేవారు ఏడాది పొడవునా పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది. సంవత్సరంలో ఇతర సమయాల్లో ముఖ్యంగా చలికాలంలో తేలికపాటి క్రీమ్‌ను అప్లై చేయడం మంచిది.

ఇంటి నుండి బయకు వెళ్ళే సమయంలో ఉన్ని లేదా కాటన్ సాక్స్ ధరించండి.  పాదాలు కవర్ అయ్యేలా బూట్లు ధరించండి. ఇంట్లో కూడా చెప్పులు లేదా కాటన్ సాక్స్ ధరించడం మంచిది.