వాస్తు శాస్త్రం ప్రకారం రెడ్‌వుడ్ మొక్కలను మన ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. ఎందుకంటే ఈ రెండు దిశలలో మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా, మంచిదిగా పరిగణిస్తారు. ఈ పూల మొక్కకు తగినంత సూర్మరశ్మి తగిలేలా నాటుకోవాలి.
హిందూ విశ్వాసాల ప్రకారం, మంగళవారం నాడు ఆంజనేయుడికి ఎర్రటి పువ్వులు సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ఎర్రటి మందార పూలను సూర్య భగవానుని పూజలో కూడా ఉపయోగిస్తారు.
మందార పూలు అనేక రంగులలో ఉంటాయి. కానీ ఎర్ర మందార పువ్వు ఆర్థిక సమస్యలను తొలగించడంలో చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. శుక్రవారం నాడు మీ ఇంటికి సమీపంలోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఎర్రటి పువ్వును సమర్పించండి.
మందార పూల మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఎరుపు ధైర్యానికి చిహ్నం. హాయి కోసం ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. జాతకంలో సూర్యుని దుష్ప్రభావం ఉన్నవారు ఈ పరిహారం చేయాలి.
మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే, ఇంటికి తూర్పు దిశలో ఎర్ర మందార చెట్టును నాటడం మంచిది. ఇది మీ సూర్యగ్రహన్ని బలపరుస్తుంది. అంతేకాదు, మందార చెట్టు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది.
మాంగల్య దోషం పోవాలంటే ఎర్ర మందార మొక్కను నాటండి. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే లేదా వివాహం మొదలైన వాటిలో ఆలస్యం అయినట్లయితే, ఎరుపు మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభప్రదం.
వ్యాపారంలో ఎక్కువ లాభం, డబ్బు సంపాదించాలనుకునే వారు మందారను నివారణగా ఉపయోగించవచ్చు. జీవితంలో త్వరగా పురోగతి సాధించడానికి ఇది తోడ్పడుతుంది. డబ్బు సంబంధిత సమస్యలకు పరిష్కారం కోసం మందార పూలను ఉపయోగిస్తారు.
మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, శాంతిని కలిగించే అనేక పూలు, మొక్కలను కూడా వాస్తులో సూచిస్తుంది.మందార మొక్కలు మీ జీవితంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి. ఈ పువ్వులు, మొక్కలు మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకురాగలవు.