ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దు ఇదే! హైటెంతో తెలుసా!

TV9 Telugu

28 May 2024

అమెరికాలోని ఓరెగావ్ రాష్ర్టంలో ఉన్న జంతు సంరక్షణశాలలో సేదతీరుతున్న ఆరేళ్ల హోల్ స్టీన్ జాతి ఎద్దు సరికొత్త గిన్నిస్ రికార్డు ను సృష్టించింది.

ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. టామీ అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తు పెరిగి ఈ రికార్డును నెలకొల్పింది. గిన్నిస్ బుక్ నిర్వాహకులు రోమియో తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

భారీ ఆకారంతో కనిపించినప్పటికీ రోమియో మృదు స్వభావి అని దాని యజమాని మిస్టీ మూర్ చెప్పింది. యాపిల్స్, అరటి పండ్లను ఇష్టంగా తింటుందట.

రోజుకు 45 కేజీల గడ్డిని అలవోకగా లాగించేస్తుంది రోమియో. భారీ సైజు వల్ల ప్రత్యేక వాహనంలో ఈ ఎద్దును తరలిస్తారు.

రోమియోను వధించేందుకు కొందరు కబేళాకు తరలించినప్పుడు దాని వయసు కేవలం 10 రోజులే. ఈ విషయం తెలిసి ఓ వ్యక్తి దాన్ని కాపాడాడు

భారీ ఆకారంతోపాటు అందమైన రూపం, తెలివితేటలు రోమియోకు పేరుకు తగ్గట్లుగానే సరిపోయాయి. తిండి ఖర్చు కోసం విరాళాలు సేకరిస్తారు.

ఇలాంటి భారీ ఎత్తు పెరిగిన ఎద్దులు ప్రపంచంలో చాల ఉన్నాయి. కానీ ఈ ఎద్దు మాత్రం అన్నింటిని మించి భాగా ఎత్తు ఎదిగింది.