ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఇక్కడే..!

TV9 Telugu

03 June 2024

ప్రపంచవ్యాప్తంగా వెనిజులాలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక.

ఈ సమాచారం ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ప్రచురించిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

వెనిజులా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశం. ఇక్కడ 1,00,000 జనాభాకు 39.4 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.

ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానం. మరణాల్లో 80% తలకు గాయంతోనే అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు లక్ష జనాభాకు 9.5 మంది. దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా కబళిస్తున్న రోడ్డు ప్రమాదాలు.

50 లక్షల మందికి పైగానే వికలాంగులు అవుతున్నారు. దేశంలో నిత్యం సగటున 462మంది, ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారు.

ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 19 మంది దాకా మరణిస్తున్నారు. నిత్యం సగటున 1,264 చిన్న, పెద్ద రహదారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ ప్రమాదాలకు కారణం మొబైల్ ఫోన్ వాడడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం కూడా దీనికి కారణం.

హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్ ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో రహదారి ప్రమాద మరణాల్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.