వర్షంలో వేడివేడిగా తినాలనిపిస్తుందా..? ఈ స్నాక్స్ ట్రై చేయండి!
01 September 2024
TV9 Telugu
TV9 Telugu
బయట ఒకటే వానలు.. ఇంట్లో వెచ్చక దుప్పటి కప్పుకుని, వేడి వేడిగా ఏదైనా తింటే బాగుంటుందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. బయటి తిరుతిళ్లు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి
TV9 Telugu
ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు బయటి ఆహారాలకు దూరంగా ఉంటారు. అయితే సాయంత్రం పూట నోటికి రుచిగా, మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు చేసే చిరు తిళ్లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
TV9 Telugu
చాలా మందికి చల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడా తినడం అలవాటు. ఇవేకాకుండా ఇంట్లోనే మరెన్నో రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.
TV9 Telugu
మంచి ఆరోగ్యానికి ఈ కింది స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో ప్రొటీన్ల లోటు కూడా తీరుతుంది. అవేంటో.. ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
సోయాబీన్ చాట్ చాలా బాగుంది. బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, ఉల్లిపాయలు, మిరపకాయలు, టమోటాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన సోయాబీన్స్ వేసి, అందులో ఉప్పు, మిరియాలు, నిమ్మరసం, తరిగిన కొత్తిమీర తురుము వేసి, చిన్న చిన్న వడల మాదిరి కాల్చుకుంటే సరి
TV9 Telugu
ఒక గిన్నెలో పెరుగు, వేయించిన శెనగపిండి, కాశ్మీరీ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చక్కెర, నూనె వేసి పిండిని తయారు చేసుకోవాలి. అందులో చీజ్ కట్ వేసి అరగంట నాననివ్వాలి . తర్వాత వీటిని సన్నని సెగపై కాల్చితే రుచికరమైన పనీర్ టిక్కా రెడీ అయినట్లే
TV9 Telugu
బాదంపప్పును ఉల్లిపాయ, కారం, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి.. బాదం చాట్ తయారు చేసుకోవచ్చు. ఇది రుచికే కాదు.. చాలా ప్రొటీన్లు కూడా ఉంటాయి
TV9 Telugu
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి.. అందులో మఖానా వేసి ఎర్రగా అయ్యేంత వరకూ వేయించాలి. ఆపైన కొంచెం ఉప్పు, చాట్ మసాలా వేస్తే.. మఖానా స్నాక్స్ రెడీ అయిపోయినట్లే