ఒంట్లో కొలెస్ట్రాల్‌ను వేగంగా కరిగించే ఆహారాలివే..

30 July 2024

TV9 Telugu

TV9 Telugu

రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. ప్రతి రోజూ మందులేసుకోవాల్సిందే. అయితే ఆహారం, వ్యాయామ నియమాలను పాటించడం ద్వారా కూడా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు

TV9 Telugu

కొద్ది కిలోలు ఎక్కువ బరువున్నా కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరుగుతాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి. రోజూ కాసేపు ఏరోబిక్‌ వ్యాయామాలు.. అంటే నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటివి చేయాలి

TV9 Telugu

అలాగే కొలెస్ట్రాల్ పెరిగితే ఆహారంపై నియంత్రణ ఉండాలి. మీరు ఎంత అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే, మీ కొలెస్ట్రాల్ అంత ఎక్కువగా పెరుగుతుంది

TV9 Telugu

కొలెస్ట్రాల్ తగ్గాలంటే డైట్‌పై శ్రద్ధ పెట్టాలి. కొలెస్ట్రాల్‌ను త్వరగా తగ్గించాలంటే ఉల్లిపాయ-వెల్లుల్లితో చేసిన ఆహారం తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ రోగులకు మేలు చేస్తుంది

TV9 Telugu

ఇందులోని అల్లిసిన్, క్విసెటిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ రోగులు తప్పనిసరిగా పెరుగు తీసుకోవాలి. బాదంపప్పును పెరుగుతో కలిపి తింటే కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా తగ్గుతుంది

TV9 Telugu

రోజుకు 3-4 కప్పుల గ్రీన్ టీ తాగాలి. అందులో నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. నిమ్మరసం, గ్రీన్ టీ కలిపి తాగడం వల్ల కొలెస్ట్రాల్‌తోపాటు, గుండె జబ్బులు తగ్గుతాయి

TV9 Telugu

పప్పులు, అన్నం తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ ఎంచుకుంటే పూర్తిగా ఫిట్‌గా ఉండొచ్చు

TV9 Telugu

పచ్చి పసుపు, మిరియాల పొడిని వేడి నీటిలో కలుపుకుని కూడా తాగవచ్చు. 12 వారాల పాటు ఈ డ్రింక్ తాగితే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే కొలెస్ట్రాల్ నిర్ధారణ అయితే ఆయిల్, స్పైసీ, ఫ్యాటీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది