ఒక్కోసారి పసిపిల్లలకు ఆగకుండా ఎక్కిళ్లు వస్తాయి. అలాంటి సయంతో ఏం చేయాలో తెలియక తల్లి మనసు తల్లడిల్లిపోతుంది
కొత్తగా తల్త్లెన మహిళలైతే ఆ సమయంలో బుజ్జాయికి ఏం జరిగిందో అర్థంకాక ఆందోళన పడుతుంటారు. సాధారణంగా వాటంతటవే వచ్చి తగ్గుతుంటాయి
నిజానికి పుట్టినప్పటి నుంచి ఏడాది వయసొచ్చే వరకు చిన్నపిల్లల్లో ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు
పాలు తాగే క్రమంలో పొట్టలోకి కాస్త గ్యాస్ వెళ్లడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు
దీన్ని బయటికి పంపించడానికి చిన్నారులు పాలు తాగే క్రమంలో మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ. పాపాయిని కూర్చోబెట్టి నెమ్మదిగా వెన్ను పైనుంచి కింది దాకా తట్టడం చేయాలి
దీనిని బర్పింగ్ అంటారు. పాలు పట్టిన తర్వాత నెమ్మదిగా వెన్నులో పైనుంచి కింది దాకా చేతితో రాయడం వల్ల పొట్టలోని గ్యాస్ బయటికి వెళ్లిపోయి ఉపశమనం కలుగుతుంది
కొంతమంది పిల్లల్లో ఎక్కువగా నవ్వడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వారి నోట్లో తేనెపీక పెట్టడం వల్ల ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది
అలాకాకుండా ఎంతసేపటికీ ఎక్కిళ్లు తగ్గకపోయినా, పదేపదే ఎక్కిళ్లు వచ్చినా వారిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిదనేది నిపుణులు అంటున్నారు