ఆషాడంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఈ తప్పులు చేస్తే..

Ravi Kiran

15 July 2024

ఆషాఢ మాసం దక్షిణాయన పర్వ ఋతువులో జేష్ఠమాసం అమావాస్య మరుసటి రోజు పాడ్య తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఆషాఢం జూలై 6న ప్రారంభమై ఆగష్టు 4న ముగుస్తుంది. 

ఈ మాసంలో కొత్తగా పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి వచ్చే సంప్రదాయం ఉంది. ఆషాడమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కలిసి ఉండకూడదని అని అంటారు. అది ఎందుకో తెల్సా

ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు దూరంగా ఉంటారు. ఈ సమయంలో భార్యాభర్తలు గర్భం ధరిస్తే చైత్రమాసంలో సంతానం కలుగుతుంది. 

అనగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రీయంగా ఇది కారణమని చెబుతుంటారు. 

ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. 

ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. దీన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. 

పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు.

పూర్వకాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి పనిచేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు. 

వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడిపోవాల్సిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి.

అల్లుడు అత్తవారింటికి వైపు చూడకూడదనే నియమం పెట్టారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా