మగవాళ్లతో పోలిస్తే మనకు మెగ్నీషియం అవసరం చాలా ఎక్కువ. కానీ చాలా మంది ఆడవాళ్లు పనుల హడావుడిలో ఏదో ఒకటి తిని ఆకలి తీర్చుకోవడమే తప్ప ఆహారం మీద పెద్దగా ధ్యాసపెట్టరు
TV9 Telugu
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో అలసటను తగ్గించడం, ఆకలితో లేకపోవడం వంటి వివిధ సమస్యలకు మెగ్నీషియం లోపమే ప్రధాన కారణం
TV9 Telugu
చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. రుతుక్రమం వల్ల శారీరక అలసట, 'మూడ్ స్వింగ్స్' కలుగుతాయి. మెగ్నీషియం ఈ సమస్యలను దూరం చేస్తుంది
TV9 Telugu
కొంత మందిలో ఆందోళన కారణంగా నిద్రలేమితో బాధపడుతుంటారు. మెగ్నీషియం సరైన మొత్తంలో తీసుకుంటే శరీరం మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా మంచి నిద్ర వస్తుంది
TV9 Telugu
మెగ్నీషియం కూడా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎముకలు అరిగిపోవడాన్ని నివారిస్తుంది. నొప్పుత నుండి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు తలెత్తుతాయి. ఈ ఖనిజం మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది
TV9 Telugu
చాలా మంది మహిళలు వయసు పెరిగే కొద్దీ ఆస్తమా, శ్వాస సమస్యలతో బాధపడుతుంటారు. కానీ మెగ్నీషియం ఈ సమస్యను దూరం చేస్తుంది
TV9 Telugu
జొన్న రొట్టె, వేరుశెనగ వెన్న, ఓట్స్, పాలకూర, బీన్స్, కాయధాన్యాలు వంటి వాటిల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. బ్రోకలీలో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మొలకెత్తిన శనగలు, వేరుశెనగ పప్పులో కూడా మెగ్నీషియం దొరుకుతుంది