త్వరలో రైలులో ‘పాతాళ గంగ’

01 October 2023

మనం రైలులో ప్రయాణించినప్పుడు రైలు టాయిలెట్‌లో లేదా బయట వాష్‌ బేసిన్‌ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం.

ఇకపై రైలులోని టాయిలెట్, బయట వాష్‌బేసిన్‌ దగ్గర నీరు అయిపోవడం అంటూ ఉండదు. దీని కోసం ఓ వినూత్న ప్రయత్నం జరుగుతుంది.

భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది. ఇది త్వరలోనే రైళ్లలో అందుబాటులోకి రానుంది.

రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు.

ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్ విజయవంతమైంది.

ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది.

దీంతో తర్వాతి స్టేషన్‌లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతను పరిష్కరించనున్నారు.

ఇది అంత బాగా జరిగితే ఇకనుంచి రైళ్లలో నీటి కొరత సమస్యలు ఉండవు. అయితే ఈ టెక్నాలజీని త్వరలోనే అన్ని రైళ్లలో అమర్చనున్నారు.